Governor | పారిశ్రామికవాడగా కొడంగల్ ప్రాంతం

Governor | పారిశ్రామికవాడగా కొడంగల్ ప్రాంతం
Governor | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గతేడాది వానాకాలంలో రైతు భరోసా కింద రూ.8,744 కోట్లు ఇచ్చామని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తున్నారు. పంట రుణమాఫీ కోసం రూ. 20,616 కోట్లు ఖర్చు చేశామన్నారు. సాగునీటి రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వం కొత్తగా 15.12 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 3.38కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నరేగా ద్వారా 6.52 కోట్ల పనిదినాల ఉపాధి కల్పించామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 269కోట్ల ఉచిత ట్రిప్పులు కల్పించామని గవర్నర్ తెలిపారు. మహాలక్ష్మి ద్వారా మహిళలకు రూ.9,222 కోట్ల ఆదా చేశామని, గృహజ్యోతి ద్వారా 10.97 కోట్ల జీరో బిల్లులు జారీ చేశామన్నారు.
కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోందన్నారు. 23వ బయోఆసియా సదస్సు ద్వారా రూ.1,700 కోట్ల పెట్టబడులు ఆకర్షించామన్నారు. రూ.1.61 లక్షల కోట్ల విలువైన ఎగుమతులతో రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉందన్నారు. సేవారంగం 13.5శాతం వృద్ధితో రాష్ట్ర జీవీఏకు 68.6శాతం మేరకు దోహదపడుతోందన్నారు. జీసీసీలలో 20శాతం ఆతిధ్యం ఇస్తూ హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్‌గా మారిందన్నారు. ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా కొనసాగుతోందన్నారు. ఐటీ ఎగుమతులు రూ.3.13లక్షల కోట్లకు చేరుకున్నాయన్నారు. ఐటీ రంగం 9.39లక్షల ఉద్యోగాలు కల్పిస్తోందన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధికి రేర్ నమూనా రూపొందించామని గవర్నర్ తెలిపారు.
విజన్-2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్ రూపొందించామన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18 లక్షలకు చేరిందన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలన్నారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నామన్నారు. 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందిని అంచనా అన్నారు. జీహెచ్‌ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లుగా విభజించామన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటిన్ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించామన్నారు. హైడ్రా ద్వారా 1,045 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామన్నారు. హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడామని గవర్నర్ తెలిపారు.
