వేములవాడ సన్నిధిలో ప్రభుత్వ విప్, కలెక్టర్, ఎస్పీ
వేములవాడ : దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి (Vemulawada Sri Rajarajeswara Swamy) వారి ఆలయంలో ఆదివారం ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Prabhutva Whip Adi Srinivas), సిరిసిల్ల జిల్లా కలెక్టర్ (Sirisilla District Collector) సందీప్ కుమార్ జా, రాజన్న జిల్లా ఎస్పీ (District SP) మహేశ్ సాహేబ్ గీతే, గ్రంథాలయ చైర్మన్ (Library Chairman) నాగుల సత్యనారాయణలకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో కొలువుదీరిన శ్రీస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మహామండపంలో ప్రముఖులకు రాజన్న ప్రసాదం(Rajanna Prasadam), చిత్రపటాన్ని రాజన్న ఆలయ ఇన్చార్జి ఈవో (Rajanna Temple Incharge Evo), ఆర్డీఓ రాదాబాయి (RDO Radabai) అందజేసి ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఆలయ అర్చక బృందం ప్రముఖులకు ఆశీర్వచన కార్యక్రమాన్ని గావించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు ఆలయ అర్చకులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.