government | గ్రామభివృద్ధికి కృషి చేస్తా

government | గ్రామభివృద్ధికి కృషి చేస్తా

government | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : చెన్నారావుపేట మాజీ ఎంపీపీ, భారాస మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ అండతో పాలకవర్గం ప్రజల సహకారంతో జల్లి గ్రామభివృద్ధికి(village development) కృషి చేస్తానని గ్రామ నూతన సర్పంచ్ యాట సుధాకర్ అన్నారు.

గ్రామ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకరణ అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామ ప్రజలు ఎన్నికల్లో పెద్ద ఎత్తున మద్దతిచ్చి అధిక మెజార్టీతో గెలిపించారని, వారి ఆశలు వమ్ము చేయకుండా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం(government) ద్వారా నిధులు రాబట్టి గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ఉప సర్పంచ్ మేరుగు బాబు, వార్డు సభ్యులకు ప్రజలు ఇచ్చిన సహకారం మరువలేనిదని ప్రజల పట్ల ఈ పాలకవర్గం బాధ్యతతో వ్యవహారిస్తుందని అన్నారు.

Leave a Reply