Government | దివ్యాంగులను ప్రోత్సహించాలి…

Government | దివ్యాంగులను ప్రోత్సహించాలి…

Government | భీమ్‌గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ : దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా ప్రోత్సహించాలని మండల విద్యాధికారి డి.స్వామి అన్నారు. భీమ్‌గల్ పట్టణంలోని భవిత కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. దివ్యాంగుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు.

దివ్యాంగులకు ప్రభుత్వం(Government) కల్పిస్తున్న సౌకర్యాలను తల్లితండ్రులు ఉపయోగించుకోవాలన్నారు. దివ్యాంగులకు ఆటల పోటీలు(Games competitions) నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ సత్యరమేష్, ఉపాధ్యాయులు వాసుదేవ్, ప్రత్యేక ఉపాధ్యాయుడు రామకృష్ణ, ఐఈఆర్ పిలు జలంధర్, కిషన్, పిజియోథెరపిస్ట్ మనీషా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply