పాఠశాలలో ఎమ్మెల్యే రవికుమార్ ఆకస్మిక తనిఖీ

పాఠశాలలో ఎమ్మెల్యే రవికుమార్ ఆకస్మిక తనిఖీ

ఆముదాలవలస, ఆంధ్రప్రభభ : మండలంలోని కొరపాం గ్రామ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును స్వయంగా పరిశీలించిన ఆయన, వంటశాలను తనిఖీ చేసి ఆహార నాణ్యత, శుభ్రత, మెనూ అమలుపై సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం ఎటువంటి ఆడంబరాలు లేకుండా సాధారణ విద్యార్థిలా పిల్లలతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు మరియు భోజన రుచిపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,.. ప్రభుత్వ పథకాల అమలులో, ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడం అధికారుల బాధ్యతని, నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని శేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు నూకరాజు, వండాన ఉదయ్ కుమార్, అన్నేపు భాస్కర్ రావు, సర్పంచ్ సత్యరాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply