GOVERNMENT| మహిళ అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట

  • ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్

GOVERNMENT| కడెం, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ అన్నారు. తెలంగాణ ప్రగతి ఇందిర మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రమైన కడెంలోని రైతు భవన్ వేదికలో మహిళలకు ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ హాజరై మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మహిళ అభ్యున్నతికి మొదటి ప్రాధాన్యత ఇస్తూన్నారన్నారు. మహిళలను అన్ని రంగాల్లో బలోపేతం చేయడానికి మహిళా శక్తి పెంచడానికి వారే స్వంతంగా ఆదాయం సంపాదించడం కోసం కుటుంబానికి పోషించడం కోసం అనేక పథకాలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు.

స్కూల్ యూనిఫాం, 28 కోట్ల వడ్డీలేని రుణాలు, బ్యాంక్ లింకేజీ కార్యక్రమంలో రూ.600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఉచిత బస్సు కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ఈ పథకాన్ని చాలా మంది మహిళలు ఉపయోగించుకుంటుందని.. కాంగ్రెస్ ప్రభుత్యం వచ్చిన తరవాత మహిళలకు ఇష్టమైన రంగులతో చీరలను మన రాష్ట్రంలో సిరిసిల్ల, కరీంనగర్ లో తయారు చేసిన చీరలను పంపిణీ చేస్తుందన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన సేవలు గుర్తి చేసుకుంటూ వారి పేరు మీదుగా ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ అని నామకరణం చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఆర్ డీఓ విజయలక్ష్మి, ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, కడెం మండల తహసిల్దార్ ఆర్ ప్రభాకర్, పాండవ పూర్ పీఎసీఎస్ చైర్మన్ రామడుగు శైలజ, రమేష్ రావు పీఎసీఎస్ డైరెక్టర్ గొల్ల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పి.సతీష్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్ భవాని ఆత్మ, కమిటీ డైరెక్టర్ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు ముస్కు రాజేందర్ రెడ్డి, బొడ్డు గంగన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply