Government | మంత్రి వెంటనే రాజీనామా చేయాలి…

Government | మంత్రి వెంటనే రాజీనామా చేయాలి…
Government | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో మైనింగ్ స్కామ్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చ నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మైనింగ్ స్కామ్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెట్టారని పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్కామ్‌పై సమగ్ర విచారణ జరిపేందుకు హౌస్ కమిటీ వేయాలని తాము కోరినట్లు తెలిపారు.
ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం సీఐడీ విచారణ చేపడతామని చెబుతోందని, అయితే మంత్రిపైనే సీఐడీ విచారణ జరిపితే న్యాయం ఎలా జరుగుతుందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
