దేవాలయల పునర్నిర్మాణానికి భూమి పూజ..

దేవాలయల పునర్నిర్మాణానికి భూమి పూజ..

భువ‌న‌గిరి, ఆంధ్ర‌ప్ర‌భ : భువనగిరి మున్సిపల్ పట్టణంలోని రైతు బజార్ లో పునర్నిర్మాణం చేపట్టనున్న రే ణుక ఎల్లమ్మ, బంగారు మైసమ్మ దేవాలయల నిర్మాణానికి సోమవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహాకారంతో భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖా బాబురావు మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ తో కలిసి భూమి పూజ చేశారు.

ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాల ఏర్పాటుతో పాటు, మన పూర్వీకుల ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా దేవాలయాల అభివృద్ధి, నూతన ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తు న్నదని అన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అందిస్తున్న సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బస్వాపురం ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నుండి సాగునీరు రాగానే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాలువ అభివృద్ధి పనులు పూర్తి చేసి రైతులకు దీర్ఘకాల ప్రయోజనాలు కల్పించారన్నారు. గత ప్రభుత్వం బస్వాపురం ప్రాజెక్టు నుండి కింద భాగానికి పోవు కాలువ పనులు దశాబ్దకాలంగా ప్రారంభించలేదన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహాకారంతో కాలువలకు మోక్షం లభించిందని, భువనగిరి, వలిగొండ, రైతులకు సకాలంలో నీళ్ళు అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తాడూరి నరసింహ, రంగ క్రిస్టయ్య, చిన్నం శ్రీను, రైతు బజార్ సంఘం అధ్యక్షలు యట్టా నాగరాజు, ఎస్టేట్ అఫీసిసర్ సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply