ముస్లిం సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

ముస్లిం సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎం డీ హనీఫ్
ముస్లిం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన హనీఫ్
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముస్లింమైనార్టీల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎం డీ హనీఫ్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీలో రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హమీని నిలబెట్టుకున్నారని తెలిపారు.
హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే. రాష్ట్రంలో ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనాలను విడుదల చేశారని ఇది ఒక రికార్డు అని అభివర్ణించారు. పల్నాడు జిల్లాలో ఎంతోమందికి ప్రయోజనం చేకూరనుందని వెల్లడించారు. అమరావతిలో కొత్తగా హజ్ హౌస్ నిర్మాణం చేయనున్నారని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 21 నెలలో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.
కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్‌ను త్వరలో పూర్తిచేసి అందుబాటులోకి తీసురానున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తున్నారని, వివాహ లైసెన్స్ గడువు 3 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారని గుర్తు చేశాఉ. రాష్ట్రంలో 1,500 వక్ఫ్ ఆస్తులను సర్వే చేసి కాపాడారని చెప్పారు. రాష్ట్రంలో ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోకి తేవటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలకు అన్ని విభాగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నారని వెల్లడించారు. ముస్లిం సోదరులకు డాక్టర్ హనీప్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యానికి, సోదరభావానికి రంజాన్ పవిత్ర మాసం ప్రతీక అని .. అత్యంత భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో ముస్లిం సోదరులు జరుపుకునే రంజాన్ మాసం సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందని కొనియాడారు.
“హిందూ ముస్లిం భాయ్ భాయ్” అనే నినాదంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని, అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈమాన్, నమాజ్, రోజా, హజ్ యాత్ర వంటి ఇస్లాం ధర్మాలను పాటిస్తూ, అల్లాహ్ స్మరణలో గడపడం శుభపరిణామమన్నారు.
