AYYAPPA| శుభ సూచకం..

AYYAPPA| శుభ సూచకం..

  • మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

AYYAPPA| ఉయ్యురు, ఆంధ్రప్రభ : అయ్యప్ప మాల దీక్షల ద్వారా సమాజాన్ని భక్తి మార్గంలో పయనించే లాగా చేయడం శుభ సూచకమని మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బి. రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) అన్నారు. ఉయ్యూరు బైపాస్ రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయంలో టీడీపీ సారసాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్ స్వామి ఇరుముడులు సందర్భంగా దేవాలయానికి విచ్చేసి స్వాములను పూలమాలలతో(With garlands) సత్కరించారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఎంతో భక్తి శ్రద్ధలతో(With devotion and care) అయ్యప్ప దీక్షలు చేపట్టి 41వ రోజున ఇరుముడి కట్టుకొని శబరిమలై అయ్యప్ప దర్శనార్థం స్వామి కొండకు బయలుదేరుతున్నఈ స్వాములందరికీ శుభాకాంక్షలు అని, సమాజంలో భక్తిని పెంపొందించడం ద్వారా రాబోయే తరాలకు(For generations to come) మంచి మార్గ నిర్దేశం చేసిన వారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వ్యవస్థాపకులు బాబ్జి, రాఘవేంద్ర ప్రసాద్, చేదుర్తి పాటి ప్రవీణ్, శివ సాయి గారు, తిరుపతి రావు, ప్రసాద్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply