పర్యాటకులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గుడ్‌న్యూస్‌ చెప్పింది. తెలంగాణ నయాగరగా భావించే బొగత జలపాతం (Bogatha Waterfall) సందర్శనకు అధికారులు అనుమతి ఇచ్చారు. వాజేడు మండలం (Vajedu Mandal) లోని బొగత జలపాతానికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులను అనుమతించాలని (Tourists allowed) అధికారులు నిర్ణయించారు. అయితే అందులోకి దిగేందుకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు.

రెండు రోజుల క్రితం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో బొగత జలపాతం దగ్గర అత్యంత ప్రమాదకరంగా వరద ఉధృతంగా ప్రవహించింది. ప్రమాదం పొంచి ఉండటంతో జలపాతం దగ్గరికి ఎవ్వరినీ అనుమతించలేదు. ప్రస్తుతం వరద తగ్గడంతో మళ్లీ పర్యాటకులను అనుమతిస్తున్నారు. తెలంగాణకు గర్వకారణమైన బొగత జలపాతాన్ని నయాగరాతో ఎందుకు పోల్చుతారో ఈ దృశ్యం చూస్తే మీకు అర్థం అవుతోంది.

ఇటీవల కురిసిన వర్షాలకు బోగత జలపాతంలోకి అత్యధికంగా వరద నీరు చేరడంతో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొద్దిరోజులపాటు బోగత సందర్శన నిలిపివేశారు. వరద ప్రవాహం తగ్గడంతో నేటి నుండి బొగత సందర్శన కు అనుమతి ఇస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు బోగత అందాలను వీక్షించడానికి క్యూ కడుతున్నారు. బొగత సందర్శనకు వచ్చిన వాహనాలను ముందస్తుగా అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి సందర్శనకు అనుమతి ఇస్తున్నారు.

Leave a Reply