గోనెప‌ల్లిలో పాప‌న్న విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

స‌ర్వాయి పాప‌న్న‌ను గుర్తించింది బీఆర్ఎస్‌
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు

సిద్దిపేట జిల్లా ప్ర‌తినిధి : ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(Andhra Pradesh)లో ఎంద‌రో గొప్ప పోరాట‌యోధుల చ‌రిత్ర మ‌రుగుప‌డింద‌ని, సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna Goud), చాకలి ఐలమ్మ(Chakali Ailamma), కొమురం భీమ్ (Komuram Bheem) వంటి తెలంగాణ (Telangana) గొప్ప పోరాట యోధుల చరిత్ర బయటకు తేలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే టి.హ‌రీశ్‌రావు(Harish Rao) అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) వచ్చిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చామ‌ని, జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వ‌హించామ‌ని గుర్తు చేశారు. ఆదివారం సిద్దిపేట గోనెపల్లి గ్రామంలో కౌడిన్యా యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీమంత్రి హరీశ్‌ రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. లండన్ లోని కేం బ్రిడ్జ్ యూనివర్సిటీ (KM Bridge University) సర్వాయి పాపన్న చరిత్ర పోరాటపటమను అధ్యయనం చేసి ఒక పుస్తకాన్ని ప్రచురించార‌న్నారు. లండన్ లో విక్టోరియా మ్యూజియం(Victoria Museum)లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ రాతి విగ్రహం ఏర్పాటు చేశార‌ని, కానీ మ‌న దేశం పాప‌న్న‌ను గుర్తించ‌లేద‌న్నారు. తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు.

గీత కార్మికుల ఉసురు పోసుకుంది కాంగ్రెస్‌
తెలంగాణంలో కల్లుగీత కార్పొరేషన్ (Kallugeeta Corporation) ఏర్పాటు చేసి గీత కార్మికుల సంక్షేమం, అభ్యున్నతికి కృషి చేసింది బీఆర్ఎస్ ప్ర‌భుత్వమ‌ని హ‌రీశ్‌రావు అన్నారు. GO 767 ద్వారా హైదరాబాద్ లో 63 సొసైటీలను (140 కల్లు దుకాణలను) మూసివేసి గీత కార్మికుల ఉసురుపోసుకుంది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ ఆ సొసైటీలను పునరుద్దరించి కల్లు దుకాణాలను తెరిపించారని గుర్తు చేశారు. చెట్ల పన్నును శాశ్వతంగా రద్దు చేయడంతో పాటు రూ 7 కోట్ల బకాయిలను రద్దు చేసిందన్నారు. తాటి చెట్టు పైనుండి ప్రమాదవశాత్తు పడి మరణించిన వారికి ఎక్స్ గ్రేసియాగా రూ. 5 లక్షలకు ఇచ్చింద‌ని, గీత కార్మికుల పెన్షన్ వయసు 50సం.లకు తగ్గించిందని తెలిపారు. రూ.20 కోట్లతో నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ సెంటర్ ను ఏర్పాటు చేసింద‌న్నారు. తెలంగాణ హరితహారం(Haritaharam) లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5కోట్ల తాటి,ఈత, ఖర్జూరం మొక్కలను నాటింద‌న్నారు. మద్యం దుకాణాల్లో గౌడ్లకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించింది కూడా కేసీఆర్ ప్ర‌భుత్వ‌మ‌ని అన్నారు.

కాంగ్రెస్ హామీ ఏమైంది?
వైన్ షాపుల్లో గౌడ కులస్తులకు 25 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నార‌ని, ఆ హామీ ఏమైంద‌ని హ‌రీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వం ఇచ్చిన 15 శాతానికే పరిమితం చేశారన్నారు. కొత్త మద్యం షాపులకు గోప్యంగా నోటిఫికేషన్ ఇచ్చార‌ని, 14వ తేదీ నాడు జీవో విడుదల చేస్తే 20న బయటకు వచ్చింద‌న్నారు. మద్యం షాపుల దరఖాస్తు ఫీజును రూ. 2 లక్షల రూ. 3 లక్షలకు పెంచార‌న్నారు. గౌడ కులస్తులకు మద్యం షాపుల్లో ఇస్తామన్న 25 శాతం రిజర్వేషన్లు జీవోలో ఎందుకు ప్రస్తావించలేదని ప్ర‌శ్నించారు. కల్లు డిపోలపై దాడులు ఆపాల‌ని ఎంత చెప్పినా ప‌ట్టించ‌కోవ‌డం లేద‌న్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క ఎక్సైజ్ అధికారి డిపోలపై దాడి చేయలేద‌ని గుర్తు చేశారు.

Leave a Reply