22 Carat Gold Rate| ప‌సిడి ప్రియం!

22 Carat Gold Rate | ప‌సిడి ప్రియం!

  • ప‌రుగులు తీస్తున్నబంగారం ధ‌ర‌లు!
  • ఈ రోజు గ్రామున‌కు రూ.66 పెరుగుద‌ల‌
  • నెల రోజుల్లో గ్రామున‌కు రూ.748లు పెరుగుద‌ల‌

GOLD RATE| వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌పంచ మార్కెట్ కు అనుగుణంగా బంగారం ధ‌ర‌లు మార్పులు జ‌రుగుతున్నాయి. నవంబర్‌లో బంగారం రేట్లు సుమారు 5.5 శాతం మేర పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌ (International market)లో కూడా బంగారానికి డిమాండ్(Demand for gold) విపరీతంగా ఉంది. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్ల కోత విధించ‌డంతో ప‌సిడి రేట్లు ప‌రుగులు తీస్తోంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాముల) 24 క్యారెట్ పసిడి ధర 4,220 డాలర్లు ( రూ. 3,78,122.65) గా ఉంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో 24 క్యారెట్‌ ఒక గ్రాము బంగారం రూ.12,158లు ధ‌ర ప‌లుకుతుంది. డిసెంబ‌ర్‌లో జరగనున్న అమెరికా ఫెడ్ రిజర్వ్(America’s Fed Reserve) సమావేశాలపై అందరి దృష్టి నెలకొంది. ఈ వారంలో కూడా ధరలు పెరిగే అవకాశం ఉందనేది విశ్లేషకుల అంచనా.

22 Carat Gold Rate |నెల రోజుల్లో గ్రాముకు రూ.748 పెరిగింది

GOLD RATE


బంగారం ధ‌ర‌లు నెల రోజుల్లో 24 క్యారేట్ ఒక గ్రామున‌కు రూ.748, 22 క్యారేట్ ఒక గ్రామున‌కు రూ.685లు పెరిగింది. డిసెంబ‌ర్‌లో మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని వాణిజ్య నిపుణులు (Commercial professionals) భావిస్తున్నారు. న‌వంబ‌ర్ ఒక‌టో తేదీన 22 క్యారేట్ ప‌సిడి ఒక గ్రాము రూ.11,275లు ఉండ‌గా, ప్ర‌స్తుతం రూ.11,960 ధ‌ర ప‌లుకుతుంది. న‌వంబ‌ర్ ఒక‌టో తేదీన 24 క్యారేట్ ప‌సిడి ఒక గ్రాము రూ.12,300లు ఉండ‌గా, ప్ర‌స్తుతం రూ.13,048 ధ‌ర ప‌లుకుతుంది.

22 Carat Gold Rate |ఈ రోజు ధ‌ర‌లు…


హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.13,048, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.11,960 ధ‌ర ప‌లుకుతుంది. నిన్నటి కంటే 24 క్యారెట్ల బంగారం గ్రామున‌కు రూ.66లు పెర‌గా, 22 క్యారెట్ల బంగారం గ్రామున‌కు రూ.60లు పెరిగింది. నిన్న టి ధ‌ర‌లు ప‌రిశీలిస్తే బంగారం ధర 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.12,982, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.11,900 ధ‌ర ప‌లుకుతుంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు ప్రపంచ బంగారం(The world’s gold) ధరలపై ఆధారపడి ఉంటాయి. ఇవి ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాలతో ఇక్క‌డ బంగారం రేటు ప్రభావితమవుతాయి.

22 Carat Gold Rate | ప‌ది రోజులుగా బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి…


రోజు 24 క్యారేట్ 22 క్యారేట్‌
డిసెంబర్ 01, 2025 రూ.13,048 (+66) రూ.11,960 (+60)
నవంబర్ 30, 2025 రూ.12,982 (0) రూ.11,900 (0)
నవంబర్ 29, 2025 రూ.12,982 (+136) రూ.11,900 (+125)
నవంబర్ 28, 2025 రూ.12,846 (+71) రూ.11,775 (+65)
నవంబర్ 27, 2025 రూ.12,775 (-16) రూ.11,710 (-15)
నవంబర్ 26, 2025 రూ.12,791 (+87) రూ.11,725 ​​(+80)
నవంబర్ 25, 2025 రూ.12,704 (+191) రూ.11,645 (+175)
నవంబర్ 24, 2025 రూ.12,513 (-71) రూ.11,470 (-65)
నవంబర్ 23, 2025 రూ.12,584 (0) రూ.11,535 (0)
నవంబర్ 22, 2025 రూ.12,584 (+186) రూ.11,535 (+170)

Click Here To Read More

Click Here To Read కూటమితోనే అభివృద్ధి 

Leave a Reply