Gold, Silver price Fall | దిగొచ్చిన వెండి.. శాంతించిన పసిడి

Gold, Silver price Fall | దిగొచ్చిన వెండి.. శాంతించిన పసిడి
వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. వాటిని కొనాలంటేనే భయపడ్డారు. గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కొనుగోలు దారులకు కాస్త ఊరట లభించింది.
అయితే ఈ రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వెండి ధర ఒక్కరోజులోనే భారీగా పడిపోయింది. కిలో వెండి ధర ఏకంగా రూ.18 వేల వరకు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,12,000కు చేరింది. ఇటీవల రోజుల్లో ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద స్థాయిలో వెండి ధర తగ్గడం ఆశ్చర్యకరమైన విషయమే. బంగారం ధరల్లో కూడా స్వల్ప మార్పు కనిపిస్తోంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,41,450గా ఉంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకిన నేపథ్యంలో ఈ తాజా తగ్గుదల కొంత ఊరటనిచ్చిందని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై నేరుగా పడుతోంది. అమెరికా డాలర్ బలపడటం, అంతర్జాతీయంగా బంగారం– వెండి ధరల్లో తగ్గుదల రావడం ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
