- మూడు రోజులో ఆగని ధర
ఆంధ్రప్రభ, బిజినెస్ వెబ్ డెస్క్ : బంగారం ధర ఎక్కడ తగ్గేదిలే.. అంటూ గత మూడు రోజులు దూసుకు పోతోంది. గోల్డ్ బ్యాంకులు, ఇన్వెస్టర్లూ క్యూకడుతున్నారు. అమెరికా ఆర్థిక అనిశ్చితి తీవ్ర ప్రభావం భారత బంగారం మార్కెట్ పై చూపింది. మరో పక్కన పొరుగు దేశాల మధ్య ఘర్షణ, యుద్ధ వాతావారణం జత కలిసింది.
అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ హెచ్చరిక.. ప్రపంచంలోని మార్కెట్లన్నీ స్వర్గధామాన్ని అన్వేషిస్తున్న తరుణంలో,,, గోల్డ్ మాత్రమే సేఫ్ హెవెన్ గా మారింది. ఇక ఇదే స్థితిలో దీర్ఘకాలం బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. మంగళవారం కూడా బంగారం ధర భగభగ మంటూ ధగ ధగ మెరిపోయింది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,250లు, 22 క్యారెట్ల బంగారం రూ.1,150లు, 18 క్యారెట్ల బంగారం ధర రూ.950లు పెరిగింది. అంటే ఈ మూడు రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3.980లు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,650లు, 18 క్యారెట్ల బంగారం ధర రూ.3000లు పెరిగింది.
ఈ దూకుడుతో మంగళవారం బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,020లు, 22 క్యారెట్ల బంగారం రూ.1,11,850లు, 18 క్యారెట్ల బంగారం ధర రూ.91,520లకు చేరింది.
నగరం | 24 క్యారెట్స్ | 22 క్యారెట్స్ | 18 క్యారెట్స్ |
---|---|---|---|
హైదరాబాద్ | రూ.1,22,020లు | రూ.1,11,850 లు | రూ.91,520లు |
వరంగల్ | రూ.1,22,020లు | రూ.1,11,850 లు | రూ.91,520లు |
విజయవాడ | రూ.1,22,020లు | రూ.1,11,850 లు | రూ.91,520లు |
గుంటూరు | రూ.1,22,020లు | రూ.1,11,850 లు | రూ.91,520లు |
విశాఖపట్నం | రూ.1,22,020లు | రూ.1,11,850 లు | రూ.91,520లు |
చెన్నై | రూ.1,22,780లు | రూ.10,950లు | రూ.92,750లు |
కోల్కత్త | రూ.1,22,020లు | రూ.1,11,850 లు | రూ.91,520లు |
ముంబై | రూ.1,22,020లు | రూ.1,11,850 లు | రూ.91,520లు |
ఢిల్లీ | రూ.1,22,070లు | రూ.1,12,000 లు | రూ.91,670లు |
బెంగళూరు | రూ.1,22,020లు | రూ.1,11,850 లు | రూ.91,520లు |
కేరళ | రూ.1,22,020లు | రూ.1,11,850 లు | రూ.91,520లు |
అహ్మదబాద్ | రూ.1,22,07 0లు | రూ.1,11,900లు | రూ.91,520లు |
వడోదర | రూ.1,22,07 0లు | రూ.1,11,900లు | రూ.91,520లు |