Gold in Heven : బంగారం దాచేయ్..
రెండు రోజుల్లో అమెరికా వడ్డీ రేట్ కట్
డాలర్ పతన ఖాయం..
స్వర్గంలోనే స్వర్ణం సురక్షితం
అందుకే వారం రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ ఊరింత
Gold in Heven : ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్ : అమెరికా వడ్డీ రేట్ తగ్గబోతోంది. డాలర్ విలువ కూడా పడిపోతుంది. బంగారం ధర మాత్రం స్థిరంగా ఉంటుంది. అందుకే బంగారం (Buy Gold) బిస్కట్లు కొను.. ఖజానాలో (Hide in Heven) దాచేయ్.. ఇదీ అగ్ర, వర్థమాన దేశాల బంగారం గోల. ఇందుకు తగ్గట్టుగానే .. అటు చైనా, ఇటు ఇండియా రిజర్వు బ్యాంకులు (Centrl Banks) బంగారం కొనుగోళ్లపైనే దృష్టి సారించాయి. ఇదే స్థితిలో.. గత ఆరు రోజులు బంగారం ధర తగ్గినట్టే తగ్గి.. ఇట్టే పెరుగుతోంది.
Gold in Heven బంగారం ప్రేమికులతో గోల్డ్ రేట్ ఆట
ఒకరకంగా పసిడి ప్రియులతో దోబూచులాడుతోంది. డిసెంబరు 1 న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹660 పెరిగి.. డిసెంబరు 2 న ₹ 610లు తగ్గింది. ఇలా.. ఒక రోజు పెరుగుతూ.. మరచి రోజు తగ్గుతూ బంగారం ప్రేమికులతో గోల్డ్ రేట్ ఆటలాడుతోంది. తాజాగా శనివారం డిసెంబర్ 6న ₹540లు తగ్గిన ధర ఆదివారం నిలకడగా ఉంది. సోమవారం బులియన్ మార్కెట్లు ఓపెన్ కాగానే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 270లు పెరిగింది. ఆదివారం ₹1,30,150లు పలికిన బంగారం ధర సోమవారం మధ్యాహ్నానికి ₹1,30,420లకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 1,19,300ల నుంచి ₹ 1,19,955లకు చేరింది. అంటే ₹ 250లు పెరిగింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర ₹ 97,610ల నుంచి ₹ 97,820లకు చేరింది. అంటే ₹ 210లు పెరిగింది.
Gold in Heven : వడ్డీ రేట్ కట్.. బంగారం దాచేయ్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల (Fed Rate Cut) తగ్గించే అవకాశాలు బలపడ్డాయి. బలహీన ఉద్యోగాల డేటా, ఫెడ్ అధికారుల డోవిష్ (Dovush) తక్కువ రేట్లకు అనుకూల వ్యాఖ్యలతో బంగారాన్ని సురక్షిత ఆస్తిగా మార్చాయి. ఫెడ్ పాలసీ నిర్ణయం జెరోమ్ పౌవెల్ వ్యాఖ్యలు మార్కెట్‌ను మరింత ప్రభావితం చేశాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో ఆర్థిక మాంద్య భయాలు పెరిగాయి, బ్యాంకు వైఫల్యాలు, అమెరికా -చైనా వాణిజ్య టారిఫ్ వార్ (Tariff War) .. బంగారం డిమాండ్‌ను పెంచాయి.
Gold in Heven డాలర్ బలహీనత, రూపాయి విలువ తగ్గుదల
ఇవి మార్కెట్లో భయాన్ని సృష్టించి, బంగారాన్ని హెడ్జ్ ఆస్తిగా మార్చాయి. అమెరికా డాలర్ బలహీనత, రూపాయి విలువ తగ్గుదల బంగారం ధరలను పెంచింది. భారతదేశంలో డాలర్ తో పోలిస్తే రూపాయి 1.1% తగ్గింది. ఇది దిగుమతి ధరలను ఇంకా పెంచుతోంది. ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణం (Inflation), కరెన్సీ విలువను తగ్గిస్తోంది, బంగారాన్ని మెరుగైన ఆస్తిగా మార్చుతోంది. RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) జనవరి 2025లో 2.8 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది, మొత్తం రిజర్వులను 879 టన్నులకు పెంచింది. గ్లోబల్ ETFలలో కూడా ఇన్‌ఫ్లోలు పెరిగాయి.
click here to read తక్కువ ప్రీమియం ఆఫర్లా? తస్మాత్ జాగ్రత్త!

