Gold | లక్కీ క్రికెటర్‌కు గోల్డ్ కాయిన్

Gold | లక్కీ క్రికెటర్‌కు గోల్డ్ కాయిన్
యువ హీరోలు రామ్ -హరి అందజేత
Gold | కోడూరు, ఆంధ్రప్రభ : టూ వీలర్స్ మెకానిక్స్ కు న్యూ నవ్యాంధ్ర మెకానిక్స్ అసోసియేషన్(Association) ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్(match)ను వీక్షించడానికి వచ్చిన మెకానికులందరూ కలిపి లక్కీ డ్రాను నిర్వహించగా లక్కీ డ్రాలో విజేతకు టీ ఎస్ ఆర్ గ్రూప్ చైర్మన్ తిరుపతి శ్రీనివాసరావు ఆర్థిక సౌజన్యంతో గోల్డ్ కాయిన్(Gold Coin)ను టీఎస్ఆర్ కుమారులు యువ హీరోలు రామ్- హరి చేతుల మీదగా అందజేశారు.
సందర్భంగా తిరుపతి శ్రీనివాసరావు, యువ హీరోలు రామ్ -హరి మాట్లాడుతూ.. ఇప్పుడు బిజీగా ఉండే టూ వీలర్స్ మెకానిక్స్ కు ఆటవిడుపుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని,ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు కడాలి ప్రసాద్(Kadali Prasad), కార్యదర్శి ఎం శ్రీను బాబు తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
