GOLD CHAIN | లిఫ్ట్‌ ఇస్తానని నమ్మించి..

GOLD CHAIN | లిఫ్ట్‌ ఇస్తానని నమ్మించి..

  • గోల్డ్ చైన్ చోరీ…

GOLD CHAIN | ప‌ల్నాడు ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : లిఫ్ట్‌ ఇస్తానని నమ్మించి.. గోల్డ్ చైన్ చోరీ చేసిన సంఘటన పల్నాడు జిల్లా, పెదకూరపాడు మండలం, జలాల పురం గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదకూరపాడు మండలం, జలాలపురం సమీపంలో లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించాడు ఓ దుండగుడు.

మండల పరిధిలోని తాళ్లూరుకు చెందిన సామ్రాజ్యం పొలానికి వెళ్లేందుకు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడగగా… గమ్యస్థానంలో దిగుతుండగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని బాధితురాలు పేర్కొన్నారు. అనంతరం బాధితురాలు పెదకూరపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

Leave a Reply