మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్కాలర్షిప్స్ పంపిణీ

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్కాలర్షిప్స్ పంపిణీ
భవానిపురం, ఆంధ్రప్రభ : మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వారు ప్రతి ఏటా పేద, మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేస్తున్న విషయం విధితమే. కాగా గురువారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కబేలా సెంటర్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక్కో విద్యార్థికి 10,000 చొప్పున 23 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ శిశు శాఖామంత్రి జి.సంధ్యారాణి, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు చేతులు మీదుగా మొత్తం 2లక్షల 30 వేల రూపాయల చెక్కును కళాశాల ప్రిన్సిపల్ ఆఫీస్ షేక్ అహ్మద్, విద్యార్థులు అందుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు ,విద్యార్థులు మలబార్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఈ అవకాశాలను ఆసరాగా తీసుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థాయికి చేరుకొని ,సమస్త పేరు నిలబెట్టాలని ప్రిన్సిపల్ కోరారు.
