Godavari | నదీ మాతకు హారతి..

Godavari | నదీ మాతకు హారతి..
Godavari, జైపూర్, ఆంధ్రప్రభ : కార్తీక మాసం పురస్కరించుకుని వేలాల గ్రామం గోదావరికి బుధవారం మహాహారతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మండలంలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రం వేలాల మల్లన్న స్వామి ఆలయం నుంచి మొదలుకొని గోదావరి నది వరకు మండలంలోని మహిళలు, భక్తులు పెద్దఎత్తున పాల్గొని గోదావరి శోభాయాత్ర నిర్వహించిన్నట్లు గోదావరి మహాహారతి మండల కన్వీనర్ డేగ నగేష్ తెలిపారు.
అర్చకుల మంత్రోచ్ఛరణలతో విశేష పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. అనంతరం మహిళలు నదిలో కార్తీక దీపాలను వదిలిపెట్టారు. ప్రతి ఏటా కార్తీక మాసం చివరి రోజున గోదావరి హారతి నిర్వహిస్తున్నట్లు గోదావరి (Godavari) మహాహారతి మండల కన్వీనర్ నగేష్ తెలిపారు. రాత్రి వరకు నదీమాతకు హారతి ఇచ్చి కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు.
