GOD | వెంక‌న్న‌కు ముత్యాల అంగీ

GOD | వెంక‌న్న‌కు ముత్యాల అంగీ

  • గుడివాడ వేంకటేశ్వర స్వామి వారికి ముత్యాల అంగీ సమర్పించిన భక్తులు

GOD | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణం జగన్నాథ‌పురంలో వేంచేసి ఉన్న వేంకటేశ్వర స్వామి వారికి భక్తులు డాక్టర్ చాగంటిపాటి రాజ్ కుమార్, డాక్టర్ సౌజన్య దంపతులు ముత్యాల అంగీ (కటివాలయం)ని శుక్రవారం స్వామివారికి సమర్పించారు. ముందుగా జగన్నాథ‌పురం వీధుల్లో మేళతాళాలు, గోష్టి సభ్యుల కోలాట నృత్యాల(The group members’ dance moves) మధ్య స్వామివారికి సమర్పించనున్న ముత్యాల అంగీని ఊరేగింపు నిర్వహించారు. స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం దేవస్థాన మండపంలో భక్తులు రాజ్ కుమార్ దంపతులు… దేవస్థానం ఈవో కందుల గోపాలరావుకు ముత్యాల అంగీని అందజేశారు. అనంతరం ముత్యాల అంగీ(Pearl robe)ని భక్తుల కోసం మండపంలో ప్ర‌ద‌ర్శించారు.

GOD

ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ.. అనేక ప్రత్యేకతలతో తమిళనాడులో రూపొందించిన ముత్యాల అంగీని స్వామివారికి సమర్పించినట్లు తెలిపారు. ఈ అంగీతో స్వామివారికి వైష్ణవ సంప్రదాయం ప్రకారం ముత్తంగి సేవ పూజలు(Muthangi Seva Puja) నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ సేవను నిర్వహించడం తొలిసారి అని ఈవో గోపాలరావు చెప్పారు. ఈనెల 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు నిర్వహించే ధనుర్మాస ఉత్సవ వేడుక(Dhanurmasa festival celebration)ల్లో స్వామివారికి ముత్తంగి సేవ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈవో గోపాలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ లింగం శివరాం ప్రసాద్, ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, ఆండాళ్ గోష్టి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply