గోవా గవర్నర్ ప్రత్యేక పూజలు

గోవా గవర్నర్ ప్రత్యేక పూజలు

శ్రీకాకుళం, అక్టోబరు 8(ఆంధ్రప్రభ బ్యూరో) : గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) కు శ్రీకూర్మంలో ఆలయ అధికారులు, అర్చకులు బుధవారం ఘన స్వాగతం పలికారు. శ్రీకూర్మనాధ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ఆయనకు పోలీసులు గౌరవ వందనాన్ని సమర్పించారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, శాసన సభ్యులు గొండు శంకర్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, తదితరులు ఉన్నారు. గోవా గవర్నర్ వెంట విజయనగరం (Vizianagaram) పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసన సభ్యులు పూసపాటి అతిథి ఉన్నారు. శ్రీకూర్మనాధ స్వామి వారిని దర్శించుకుని వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం దేవస్థానం ధర్మ కర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

పూసపాటి అశోక్ గజపతి రాజు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దేవస్థానం సభ్యులు (Devasthanam members) కైబాడి కుసుమ కుమారి, పళ్ళ పెంటయ్య, గొండు శ్రీనివాసరావు, అందవరపు మునీక, అరవెల్లి శ్వేతాబిందు, తన్ని సూరి బాబు, మళ్ళ కళ్యాణ చక్రవర్తి, జమ్ము లక్ష్మి శ్రీకూర్మనాధ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ్యులను సత్కరించారు. గుంట్రెడ్డి సంయుక్త అందుబాటులో లేనందు వలన ప్రమాణ స్వీకారం చేయలేదు.

గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) మాట్లాడుతూ… చట్ట రీత్యా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చట్టాలను గౌరవించాలన్నారు. ఎక్స్ అఫీషయో సభ్యులుగా ప్రధాన అర్చకులు ఉంటారని తెలిపారు. ట్రస్ట్ బోర్డు నియమించిన సభ్యులు దేవునికి బాధ్యతతో ఎవరు చేయాల్సిన పనులు వారు చేయాలని చెప్పారు. చట్టరీత్యా సమయానికి సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆలయాలు 105 ఉండటం వలన అన్ని సమావేశాలు నిర్వహించలేమని, ట్రస్ట్ బోర్డు అన్ని సమావేశాలు సింహాచలం లేదా విజయనగరం ఏర్పాటుకు అందరి ఆమోదం కావాలన్నారు. ఆలయ అభివృద్ధి కోసం పనిచేస్తూ హిందూ మతాన్ని కాపాడుకుందామన్నారు. దేవుని సేవ చేసే అవకాశం మనందరి కి వచ్చిందని దేవుని సేవలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ (Gondu Shankar) మాట్లాడుతూ… విజయనగరం సాంస్కృతిక, సంప్రదాయాలకు నిలయమన్నారు. మాన్సాస్ ట్రస్ట్ లో విద్య, సంగీత కళాశాలలు ఏర్పాటు చేశారని, ఈ ప్రాంతం ప్రజలు ఎందరో మాన్సాస్ ట్రస్ట్ లో చదువుకొని ఉన్నత పదవుల్లో ఉన్నట్లు చెప్పారు. సభ్యులందరినీ అభినందిస్తూ అందరూ బాధ్యతతో పని చేసుకోవాలని చెప్పారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో పుష్కరిణి అభివృద్ధికి ఇండిగో సంస్థ నుంచి పది కోట్ల రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు.

విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు (Kalisetti Appalanaidu) మాట్లాడుతూ… దేవస్థానంలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారంటే దేవుడు ఏర్పాటు చేసిన సభ్యులుగా భావించాలన్నారు. సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

విజయనగరం శాసన సభ్యులు పూసపాటి అదితి (pusapati aditi) మాట్లాడుతూ… బాధ్యతగా అందరు సభ్యులు పనిచేయాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని సేవ చేయాలని కోరారు. ఆలయం కార్యనిర్వాహక అధికారి కోట నరసింహనాయుడు ఆలయంకు సంబంధించి రాబడి, ఖర్చులు, ఆస్తుల వివరాలను సభ్యులకు తెలియజేశారు. సింహాచలంలో ఉన్న శ్రీకూర్మనాధ స్వామి వారి దేవస్థానంనకు సంబంధించి బంగారాన్ని ఛైర్మన్, శాసన సభ్యులు సహకారంతో తీసుకొని శ్రీకూర్మనాధ స్వామి వారికి ధరించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె. సాయి ప్రత్యూష, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply