వైభవంగా తులాభారం…
మక్తల్, ఆంధ్రప్రభ : కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు రాత్రి నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద స్వామివారికి తులాభారం వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మ కర్త పి.ప్రాణేషాచారి(Dharma Karta P. Praneshachari) ఆధ్వర్యంలో ఉడిపి పెజావర మఠం ధర్మప్రచారక్ విద్వాన్ రాఘవేంద్ర చార్య పర్యవేక్షణలో స్వామివారికి తులాభారం నిర్వహించారు.
స్వామివారి విగ్రహాలను ఒక వైపు ఉంచి మరోవైపు కండ చక్కెర, పండ్లు, ఫలాలు, నాణెములను వేసి స్వామివారికి తులాభారం నిర్వహించారు. ఈ వేడుకలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు .భక్తి పరవశంతో భక్తులు గోవింద నామస్యరణల మధ్య తులాబారం నిర్వహించగా పలువురు పండ్లు, ఫలాలు, కండ చక్కెర(fruits, fruits, flesh sugar) ధనమును సమర్పించి తులాభార వేడుకల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు .ఈ వేడుకల్లో వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

