వైభవంగా ఎల్లమ్మ బోనాలు..

వైభవంగా ఎల్లమ్మ బోనాలు..
వెల్గటూర్, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో ఎల్లమ్మ బోనాలను గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పిల్లా పాపాలు, పాడి పంటలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఎల్లమ్మ కొలుపు కొలుస్తారు. అందులో భాగంగా ఐదు రోజుల పాటు జరిగే అమ్మ వారి కల్యాణంతో పాటు వివిధ ఘట్టాలు ఉంటాయి.
ఈ రోజు చివరి రోజు కావడంతో అంబేడ్కర్ విగ్రహం నుంచి వీధుల గుండా బోనాలతో మహిళలు ఊరేగింపుగా వచ్చారు. పంబాల వాళ్ళ జమిడిక నృత్యాలు, డప్పు చప్పుళ్ళతో తరలి వచ్చి అమ్మ వారికి బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులు, మహిళలు, అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.
