గ్రామాభివృద్దికి నిధులు ఇవ్వండి…

గ్రామాభివృద్దికి నిధులు ఇవ్వండి…
రెండు దఫాలుగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేటాయించలేదు
నిధుల ఇవ్వాలని కలెక్టర్ ను కోరిన కోల్కొండ సర్పంచ్ కర్ణం కీర్తి రామకృష్ణ
వికారాబాద్, ఆంధ్రప్రభ : గత రెండు తోఫాలుగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు తమ గ్రామానికి కేటాయించిన కారణంగా గ్రామపంచాయతీ లో అభివృద్ధి కార్యక్రమాలు జరగడంలేదని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి కోల్కొంద సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణ పేర్కొన్నారు.
సర్పంచ్ల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా శనివారం ఆమె జిల్లా కలెక్టర్ దీపక్ తివారి జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ పి జె సింధు దృష్టికి తీసుకువచ్చారు. తమ గ్రామానికి కొంతకాలంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి లేని కారణంగా ఇబ్బందుల పాలైన మనీ ఈ విషయాన్ని పరిశీలించాలని ఆమె కోరారు
