Utnoor | మైక్రో ఫైనాన్స్ లో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం..

  • లక్షలాది రూపాయలతో చైర్మన్ కృష్ణ పరార్
  • ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు


ఉట్నూర్, జులై 16 (ఆంధ్రప్రభ ) : మైక్రో ఫైనాన్స్ కార్యాలయం (Microfinance Office) లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కార్యాలయాలు ప్రారంభం కాకముందే మధ్యవర్తులతో ఎస్ కే గ్రూప్ చైర్మన్ జె కృష్ణ (SK Group Chairman J Krishna) ఒక్కొక్క నిరుద్యోగ యువకుల నుండి 20వేల రూపాయల చొప్పున లక్షలాది రూపాయలు తీసుకొని పరారయ్యారని, మోసపోయిన యువతీ యువకులు విలేకరులతో తెలిపారు. చైర్మన్, ఆయన అనుచరులు ఫరార్ అయినట్లు తెలియడంతో డబ్బులు ఇచ్చిన నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో బుధవారం ఉట్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు.

తమకు మైక్రో ఫైనాన్స్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఉట్నూర్ (Utnoor), ఇంద్రవెల్లి (Indravelli), ఇచ్చోడ (Ichoda), ఆదిలాబాద్ (Adilabad) ప్రాంతాల్లో మైక్రో ఫైనాన్స్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, త్వరలోనే కార్యాలయాలు ప్రారంభమవుతాయని చెప్పి కాలయాపన చేస్తూ చివరకు ఫరారైన విషయం తెలుసుకొని డబ్బులు ఇచ్చిన నిరుద్యోగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

అనంతరం డబ్బులు ఇచ్చి మోసపోయిన యువకులు విలేకరులతో మాట్లాడుతూ… మైక్రో ఫైనాన్స్ బ్రాంచ్ లలో ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి చివరకు మోసం చేశారని, దాదాపు 400కు పైగా నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం ఒక్కొక్కరు 20,000 వేల పైబడి డబ్బులు చెల్లించారని, దాదాపు 80లక్షల పైగా వసూలు చేశారని వారు తెలిపారు. ఎస్ కే గ్రూప్ చైర్మన్ ప‌రార్ కావడంతో మైక్రో ఫైనాన్స్ ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులు భయపడి ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయి పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు నిరుద్యోగ యువకులు తెలిపారు. డబ్బులు ఇచ్చిన యువకుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పిర్యాదుపై పోలీసులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

Leave a Reply