అమరావతికి రాజముద్ర..

అమరావతికి రాజముద్ర..
కేక్ కట్ చేసి సంబరాలు
ఎంపీ ఆధ్వర్యంలో వేడుకలు
విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజధానిగా అమరావతికి రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించి గెజిట్ విడుదలైన సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్లో సంబరాలు నిర్వహించారు. ముందుగా ఎంపీ చిన్ని, టీడీపీ నాయకులు, టీడీసీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేకు కోసి జై అమరావతి అంటూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరై ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ సైతం హర్షం వ్యక్తం చేయగా, టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్, షేక్ ఆశ, సొంగ సంజయ్ వర్మ, ఎస్.కె కరీముల్లా, కాకు మల్లికార్జున యాదవ్, చరణ్ సాయి యాదవ్, పొట్లూరి దర్శిత్, మాదిగాని గురునాదం, ఎర్నేని వేదవ్యాస్, నరసింహ చౌదరి, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
