Gas Bomb | మధ్యతరగతిపై గ్యాస్​ బండ..

Gas Bomb | మధ్యతరగతిపై గ్యాస్​ బండ..

Gas Bomb | అకస్మికంగా ధర పెంపు
రూ.60లు పెంచిన చమురు సంస్థలు
మధ్య ఆసియాలో అమెరికా చెలగాటం

Gas Bomb | ఆంధ్రప్రభ, బిజినెస్​ డెస్క్ : పశ్చిమాసియాలో వార్ సైక్లోన్ఎఫెక్ట్‌.. భార‌త్ కొంప ముంచుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ చెల‌గాటం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేశాయి. ఇంకేముందీ… భార‌త్ లో మార్చి 7, 2026 నుంచి (శ‌నివారం) వంట గ్యాస్ (LPG) ధరలను భారీగా పెంచుతూ చమురు సంస్థలు ప్ర‌క‌టించాయి. ఏడాదిగా స్థిరంగా ఉన్న గృహ వినియోగ గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో మ‌ధ్య‌త‌ర‌గ‌తిపై గ్యాండ్ బండ ప‌డింది. గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు మరియు గ్యాస్ ధరలు పెరగడందతో దేశీయ చమురు సంస్థలు ధరలను పెంచాయి. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) కీలక రవాణా మార్గాల్లో ఏర్పడిన ఆటంకంతో రవాణ చైన్​ దెబ్బతింది.

దేశవ్యాప్తంగా డొమెస్టిక్​ సిలిండర్ (14.2 కిలోలు) ధర రూ. 60 పెరిగింది.
కమర్షియల్​ సిలిండర్ (19 కిలోలు): ఒక్కో సిలిండర్‌పై రూ. 115 లు పెరిగింది.

Gas Bomb

Gas Bomb | ఏపీ. తెలంగాణలో..

స్థానిక పన్నులు (VAT) , రవాణా ఖర్చుల ఆధారంగా ధరలు ప్రాంతాల వారీగా
తెలంగాణ హైదరాబాద్‌లో ఇప్పటి వరకు రూ. 905 గా ఉన్న గృహ వినియోగ సిలిండర్ ధర, తాజా పెంపుతో రూ. 965 కు చేరుకుంది. ఏపీలోని ప్రధాన నగరాలు విశాఖపట్నం, విజయవాడలలో కూడా ఇదే స్థాయిలో (రూ. 60) ధరలు పెరిగాయి.

Gas Bomb

Gas Bomb | ఉజ్వలకు ప్రధాని అండ ..

‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులకు ఈ పెంపు నుండి మినహాయింపు ఉంటుంది; వారికి పాత ధరలకే గ్యాస్ అందుతుంది. దాదాపు 11 కోట్ల మంది ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఊరట లభించింది. ఇక డొమెస్టిక్​ గ్యాస్​ వినియోగదారులపై దాదాపు రూ.2000 కోట్ల అదనపు భారం పడినట్టే.

Leave a Reply