తెలంగాణ‌లో నిన్న‌టి నుంచి ఏక‌ధాటిగా వ‌ర్షం కురుస్తున్నా.. గ‌ణ‌ప‌తి ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. రాష్ట్రంలో ప్ర‌తి చోట మండ‌పాలు ఏర్పాటు చేసిన గ‌ణ‌నాథుడికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. బుధ‌వారం జ‌రిగిన ఉత్స‌వాల్లో క‌లెక్ట‌ర్‌, ఎస్పీ, ఎమ్మెల్యేలు పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

గోదావరిఖని : రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. కార్యాలయం లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకొన్నారు. పూజా కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, ఆర్ ఐ దామోదర్, శ్రీనివాస్, శేఖర్,మల్లేశం, సీసీ హరీష్, ఆర్ఎస్ఐ లు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


మిర్యాల‌గూడ : మిర్యాల‌గూడ ప‌ట్ట‌ణంలో వినాయ‌క చ‌విత ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని పలు గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే బ‌త్తుల ల‌క్ష్మారెడ్డి (బీఎల్ఆర్) సంద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. గ‌ణ‌నాథుడికి డీఎస్పీ రాజశేఖర్ రాజులు ప్రత్యేక పూజలు చేశారు. మిర్యాలగూడలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ నల్లగొండ జిల్లా కో-ఆర్డినేటర్ గుడిపాటి కోటయ్య నేతృతంలోభక్తులకు మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ సభ్యులు మండ వెంకట్, జన విజ్ఞాన వేదిక నాయకులు ఫౌండేషన్ సభ్యులు గుత్తికొండ సుదర్శన్ రెడ్డి, యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు కట్టెబోయిన శ్రీనివాస్, గుడిపాటి వివేక్ యాదవ్, అంబటి శ్రీను, వడ్డేపల్లి వెంకటేష్, రాపోలు పరమేష్,నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వీరనారాయణ, శ్రీనివాస్, కురువ, మందులు అశోక్, తదితరులు పాల్గొన్నారు.


మక్తల్ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా మక్తల్ పట్టణంలోని వాడవాడలా ఇవాళ గణనాథుడు కొలువుదీరాడు. మక్తల్ పట్టణంలో వినాయకుడి శోభాయాత్ర శోభాయామానంగా సాగింది. మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లోని వినాయకుడి ఉత్సవ విగ్రహాలకు విశ్వకర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మక్తల్ పట్టణంలో లో శ్రీ ఉమామహేశ్వరాలయంలో వినాయకుడిని ప్రతిష్ఠించి ఆలయ అర్చకులు సిద్ధరామయ్య స్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కర్ని స్వామి, బాల్చేడ్ మల్లికార్జున్, జి.బలరాం రెడ్డి, బి.రాజశేఖర్ రెడ్డి,బి.ఆంజనేయులు సూర్య ,ఆడెం సత్యనారాయణ, సుకన్య శేఖర్, కావలి వెంకటేష్, ప్రతాప్ రెడ్డి, రాజుల ఆశిరెడ్డి,వాకిటి శేషగిరి,జి.లక్ష్మారెడ్డి, బోయరవి , కట్ట సురేష్ కుమార్ గుప్తా,కావలి ఆంజనేయులు,ఆడెం శ్రీనివాసులు, గోవర్థన్,కట్ట వెంకటేష్,విశ్వ హిందూ పరిషత్ , నాయకులు వి.భీమ్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, బజరంగదళ్ నాయకులు భీమేష్ తదితరులు పాల్గొన్నారు.


రాజన్న సిరిసిల్ల : జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన‌ మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మ‌ట్టి వినాయకుడికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్ర‌త్యేక‌ పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, ఏఓ రాంరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాంచందర్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, డీ డబ్ల్యూఓ లక్ష్మీరాజం, ఎల్డీఎం మల్లికార్జునరావు, తహసీల్దార్లు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply