గణేశ్​ నిమజ్జన వేళ‌.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : గణేశ్ నిమజ్జనానికి (For Ganesh immersion) రాష్ట్ర ప్ర‌భుత్వం (state government) ప‌క‌డ్బందీగా ఏర్పాట్ల‌ను చేస్తోంది. ముఖ్యంగా ఖైరతాబాద్​ (Khairatabad) గణేశ్​ నిమజ్జనం చూడటానికి ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారు. ఈ సంద‌ర్భంగా చాలా వరకు దారి మళ్లింపులు ఉంటాయి. ఇందిరాపార్క్ (Indira Park) నుంచి వాహనాలను అనుమతించరు. అలాగే హిమాయత్​నగర్​ (Himayatnagar) వైపు రోడ్డు మళ్లింపు ఉంటుంది. హుస్సేన్​సాగర్​ (Hussain Sagar) చుట్టువైపులా రాకపోకలు నిలిపివేస్తారు. దీంతో వాహనాలకు అనుమతి ఉండదు.

వినాయ‌కుల‌ నిమజ్జనం వేళ భ‌క్తుల సౌక‌ర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను (RTC buses) న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. హుస్సేన్​సాగర్​లో గణేశ్​ విగ్రహాల నిమజ్జనాన్ని వీక్షించేందుకు రాష్ట్రంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ మేరకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఆర్టీసీ హైదరాబాద్​ (RTC buses) రీజియన్​, చార్మినార్​ (Charminar) డివిజినల్​ పరిధిలోని బర్కత్​పురా, ముషీరాబాద్​, ఫలక్​నూమా, కాచిగూడ, మెహదీపట్నం, రాజేంద్రనగర్​ డిపోలు, హయత్​నగర్ పరిధిలోని దిల్​సుఖ్​నగర్​, హయత్​నగర్​-1, 2, మిథాని డిపోల నుంచి నిమజ్జనం కోసం బస్సులను నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ నగర​ రీజియన్​ రీజినల్ మేనేజర్​ (ఆర్​ఎం) సుధా పరిమళ తెలిపారు.

కాచిగూడ, రాంనగర్‌ నుంచి బషీర్‌బాగ్‌ వరకు, కొత్తపేట, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, మిథాని నుంచి ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వరకు, జామై ఉస్మానియా నుంచి ఇందిరా పార్క్, గచ్చిబౌలి, లింగంపల్లి, రాజేంద్రనగర్‌ నుంచి లక్డీకాపూల్, పటాన్‌చెరు నుంచి లింగంపల్లి, ఆఫ్జల్‌గంజ్‌ నుంచి ఆలిండియా రేడియో వరకు బస్సుల రాకపోకలు సాగుతాయి.

Leave a Reply