Gandlagudem | పంట పొలాల్లో ప్రచారం..

Gandlagudem | పంట పొలాల్లో ప్రచారం..
Gandlagudem, అశ్వారావుపేట, ఆంధ్రప్రభ : ఈనెల 14న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలలో మండలంలోని గాండ్ల గూడెం గ్రామపంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మాలోత్ ఆలీ బాబు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా గడిచిన కొద్ది రోజుల నుండి పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో, వ్యవసాయ క్షేత్రాలలో కూలీలు వద్దకు వెళ్లి ఆలీబాబు విస్తృత ప్రచార నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్ని ప్రభుత్వాలు మారినా గాండ్ల గూడెంలో ఎక్కడ సమస్యలు అక్కడే తిష్ట వేశాయని ప్రజలు తనను ఆదరించి ఉంగరం గుర్తు పై ఓటు వేసి సర్పంచ్ గా అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అన్నారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. స్థానికుడైన తనకు గ్రామ సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉందని, ప్రజలు అధికార పార్టీ అభ్యర్థిని ఎన్నుకొనడం వలన ప్రజా సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందే అవకాశం ఉందని అన్నారు.
తనకు ఉన్న సమస్యలపై అవగాహన, రాజకీయ అనుభవంతో పంచాయతీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం, మంచినీటి సౌకర్యం తదితర సమస్యలను పరిష్కరిస్తానని అలాగే అధికార పార్టీ నేతలతో మాట్లాడి అత్యధిక విధులు గాండ్లగూడెం గ్రామపంచాయతీకి వచ్చేలా చేసి పంచాయతీని అభివృద్ధి చేస్తానని ప్రజలకు మాలోత్ ఆలీ బాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
