G.O. No.153 | నిధులు కేటాయించాలి…

G.O. No.153 | నిధులు కేటాయించాలి…

G.O. No.153 | కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులైన వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ లో నిధులుకేటాయించడంతోపాటు, జిల్లాలో నూతన పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నాడు స్థానిక సి.ఆర్. భవన్ నందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపన స్థానిక యువతకు ఉపాధి అనే అంశంపై ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఈ. శ్రీరాములు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి మాట్లాడుతూ 2018 సంవత్సరం ఆఖరిలో అసెంబ్లీ ఎన్నికల ముందు కోడుమూరులో వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడి కాలవల నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసి వాటి నిర్మాణం కోసం జీ.వో నెంబర్ 153 విడుదల చేశాడని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటి నిర్మాణం కోసం నిధులు కేటాయించకపోవడంతో ఈ ప్రాజెక్టులు శంకుస్థాపనలకే పరిమితం అయ్యాయి.

G.O. No.153 |

అని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలకు ముందు కర్నూలు జిల్లా ప్రాజెక్టుల పైన వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టు లు పూర్తి చేయడానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు ఈ రెండు సంవత్సరాల కాలంలో జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడు తప్ప వాటికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఇప్పుడు జరిగే బడ్జెట్ సమావేశాల్లోనైనా ప్రాజెక్టుల పూర్తి కోసం నిధుల కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

G.O. No.153 |

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ మునెప్ప, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆనంద్ బాబు, ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బస్తిపాడి రామకృష్ణారెడ్డి లు మాట్లాడుతూ… పాలకుల నిర్లక్ష్యం వల్ల కర్నూలు జిల్లా వలసలకు నిలయంగా మారిందని ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం కర్నూలు జిల్లా ప్రాజెక్టు పూర్తి చేసి వలసల నివారిస్తామని హామీలు ఇచ్చే పాలకులు అధికారం చేపట్టిన తర్వాత వాటి గురించి మాట్లాడకపోవటం బాధాకరమన్నారు.

2018లో 8 టీఎంసీల సామర్థ్యంతో కేవలం 1900 కోట్లతో పూర్తయ్యే వేదవతి ప్రాజెక్టులకూ ప్రజా ప్రతినిధులు నిధులు సాధించలేకపోతున్నారంటే జిల్లా ప్రాజెక్టుల పైన వారి చిత్తశుద్ధి అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కావున వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడి కాలువల సాధించేంతవరకు ప్రజా పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు, ఐ ఎన్ టియుసి జిల్లా అధ్యక్షులు బతుకన్న, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు,నగర కార్యదర్శి బిసన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షాబీర్ భాష, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, ఏఐఎస్ఎ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేంద్ర నాయుడు, బీసీ విద్యార్థి సంఘం నాయకులు ఆనంద్, ఆర్ వై పి ఎస్ నాయకులు వివి నాయుడు, రాయలసీమ స్టూడెంట్ జేఏసీ నాయకులు కోనేటి వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ కర్నూల్ నగర పంచలింగాల దగ్గర రైల్వే వ్యాగన్ పరిశ్రమ ఏండ్ల తరబడి నిర్మాణ దశలను కొనసాగుతుందని దాని వెంటనే పూర్తి చేయడంతో పాటు, ఓర్వకల్లులోని పారిశ్రామిక హక్కులు నూతన పరిశ్రమలకు అధిక నిధులు కేటాయించి స్థానిక యువతకే 80% ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా జీవో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి శ్రావణి, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి సి మహేష్, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి శ్రీనివాసరావు, హోటల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి టి రామాంజనేయులు, ఏ ఐ వై ఎఫ్ నగర అధ్యక్షలు నాగరాజు, నగర నాయకులు అఖిల్, కళాకరు, శ్రీకాంత్, శివ, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ కుమార్ నగర అధ్యక్ష కార్యదర్శులు అభి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

click here to read more : Minister | మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధుల ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌…

click here to read more :

Leave a Reply