Funds | రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించండి

Funds | రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించండి

  • కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కోరిన ఎంపీ డీకే అరుణ

Funds | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని బీటీ రోడ్ల(Beatty Roads)కు నిధులు మంజూరు చేయాలని కోరుతూ పాలమూరు పార్లమెంటు సభ్యులు డీకే .అరుణ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు.

మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలంలో పీడబ్ల్యూడి రోడ్డు(PWD Road) నుండి పర్మన్ దొడ్డి వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు నిధులు మంజూరు చేయాలని మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. అదే విధంగా మక్తల్ మండలంలోని జెడ్పీ రోడ్డు నుండి అంకెన్ పల్లి వరకు, జడ్పీ రోడ్డు నుండి గడ్డంపల్లి, పీడబ్ల్యుడీ రోడ్డు నుండి భూత్పూర్ వరకు, గుర్లపల్లి ఎక్స్ రోడ్డు నుండి దాసర్ దొడ్డి వయా వనాయకుంట వరకు, పీడబ్ల్యుడీ రోడ్డు నుండి బొందలకుంట, పీడబ్ల్యుడీ రోడ్డు నుండి దాసర్ దొడ్డి, పిడబ్ల్యుడి రోడ్డు మక్తల్ నుండి గుర్లపల్లి వరకు అదేవిధంగా పిడబ్ల్యుడి రోడ్డు జక్లేర్ నుండి జౌళాపూర్, పిడబ్ల్యుడి రోడ్డు నుండి టేకులపల్లి బీటీ రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని ఎంపీ డీకె.అరుణ(MP DK. Aruna) కోరారు.

ఊట్కూరు మండలంలోని పిడబ్ల్యుడి రోడ్డు నుండి వల్లంపల్లి వరకు బీటి రోడ్డు నిర్మాణానికి నిధులు(Funds) కేటాయించాలని కోరుతూ ప్రతిపాదనలను కేంద్రమంత్రికి ఎంపీడీకే అరుణ అందజేశారు. ఈ ప్రతిపాదనలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని వీలైనంత త్వరగా ప్రతిపాదనలను ఆమోదించి నిధులు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు ఎంపీ అరుణ తెలిపారు.

Leave a Reply