IND vs ENG | ఓటమంచుల నుంచి విజయతీరాలకు… సిరీస్ మనదే !
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య పుణే వేదికగా జరిగిన ఉత్కంఠ నాలుగో టీ20లో టీమిండియా విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలుత స్వల్ప పరుగులకే కీలక వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో ఈ మ్యాచ్ లో టీమిండియాకి ఓటమి తప్పదు అనుకున్న సమయంలో పాండ్యా(53), దూబే (53) చెరో అర్థ సెంచరీతో తెలరేగి… టీమిండియా స్కోర్ బోర్డుపై 180 పరుగులు నమోదు చేయడంలో సాహాయపడ్డారు.
అనంతరం చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (23), బెన్ డకెట్ (39) భారత బౌలర్లను బెంబేలెత్తించారు. అనంతరం వచ్చిన హ్యారీ బ్రూక్ (26 బంతుల్లో 51*) అర్ధసెంచరీతో చెలరేగాడు. అయితే భారత బౌలర్లు కోలుకుని వరుస వికెట్లు తీసి భారత జట్టును విజయతీరాలకు చేర్చారు.
టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ్ (3/28), హర్షిత్ రాణా(3/33) మూడేసి వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి(2/28) రెండు, అర్షదీప్ సింగ్ (1/35) ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.
సిరీస్‌లోని ఐదో మ్యాచ్ ఫిబ్రవరి 2న వాంకడే స్టేడియంలో జరగనుండగా.. ఫిబ్రవరి 6నుంచి 12 వరకు మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరగనుంది.