frienship | స్నేహితుని జ్ఞాపకార్థంగా మినీ వాటర్ ట్యాంకును ప్రారంభం

frienship | స్నేహితుని జ్ఞాపకార్థంగా మినీ వాటర్ ట్యాంకును ప్రారంభం
frienship | ఎడపల్లి, ఆంధ్రప్రభః నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని శివాలయంలో భక్తుల సౌకర్యార్థం 2001 బ్యాచ్‌కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు మినీ వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. తమ మిత్రుడు ఉప్పు సుమన్ జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించి ట్యాంక్‌ను ప్రారంభించారు.
ఈ మినీ వాటర్ ట్యాంక్ ద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించబడనుంది. గ్రామాభివృద్ధికి తోడ్పడేలా స్నేహితుడి జ్ఞాపకార్థం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థుల ఈ సేవా కార్యక్రమం గ్రామంలో స్ఫూర్తిదాయకంగా నిలిచిందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.
