ఇంటింటికి స్వ‌చ్ఛ‌మైన‌ తాగునీరందిచ‌డ‌మే ల‌క్ష్యం…

ఇంటింటికి స్వ‌చ్ఛ‌మైన‌ తాగునీరందిచ‌డ‌మే ల‌క్ష్యం…

  • సర్పంచ్ ముకురాల అశోక్ గౌడ్

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌తి ఇంటింటికీ స్వ‌చ్ఛ‌మైన తాగునీరు అందించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని నాగ‌పూర్ స‌ర్పంచ్ ముకురాల అశోక్‌గౌడ్ అన్నారు. గురువారం గ్రామంలో జల మహోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఇంటింటికి మంచినీరు” “తెలంగాణ రైజింగ్” పేరుతో పంచాయతీ కార్యదర్శి జగన్ నిర్వహణలో మిషన్ భగీరథ అధికారుల పర్యవేక్షణలో గ్రామంలో ఊరేగింపు నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స‌ర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే మంచినీటిని ఎలా సమర్థవంతంగా సరఫరా చేయాలో వివరించారు. అలాగే మంచినీటి వినియోగం, నిర్వహణకు సంబంధించిన అంశాలను క్రమం తప్పకుండా నమోదు చేసుకోవాలని సూచించారు.

అనంతరం సర్పంచ్ అశోక్‌గౌడ్, ఉప సర్పంచ్ ప్రకాష్‌రావ్, వార్డు సభ్యులతో కలిసి మిషన్ భగీరథ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డీఈ హరీష్, ఏఈ వెంకటేష్, వార్డు సభ్యులు చింతల కీర్తన, కట్కం భాగ్యమ్మ, కాశీపురం విజయలక్ష్మి, శ్యామల, కట్కం మధు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply