ఉచిత వైద్య శిబిరం, మందులు పంపిణీ

ఉచిత వైద్య శిబిరం, మందులు పంపిణీ

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో గల లయన్స్ క్లబ్ భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సేవ ఆధ్వర్యంలో, ట్రాఫిక్ పోలీస్ ల సహకారంతో గురువారం ఉచితంగా కంటి వైద్య పరీక్షలు, మధుమేహ, రక్తపోటు పరీక్షలను నిర్వహించారు. ఈ శిబిరంను ట్రాఫిక్ సీఐ విజయ్ మోహన్ ప్రారంభించగా డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి కంటి నిపుణులు గుంటోజు సంధ్యారాణి పర్యవేక్షణలో పరీక్షలు జరిపారు. పుర ప్రజలకు మధుమేహ రక్త పోటు పరీక్షలు జరిపి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిరందాసు జగన్నాథం, కార్యదర్శి అతహర్ పాష, సభ్యులు ఉప్పు ఆంజనేయులు, కాసుల వెంకటేశం, కటికం ప్రశాంత్, కొసనం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply