Vikarabad | నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ.. షేక్ సుభాన్

వికారాబాద్, మే 15 (ఆంధ్రప్రభ) : గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత వసతితో కూడిన శిక్షణ, ఉద్యోగ అవకాశం నిర్వహిస్తున్నట్టు వికారాబాద్ జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ సుభాన్ తెలిపారు. ఎంఆర్ఎఫ్ ప్రవైట్ లిమిటెడ్ (సదాశివపేట, ఎన్కెపల్లి) నందు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయ‌న పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరములకు జాబ్ మేళా నిర్వాహకుడు మియా సాబ్ 9676047444 ద్వారా సంప్రదించవచ్చన్నారు.

Leave a Reply