పీసపాడులో నలుగురికి తీవ్ర గాయాలు

పీసపాడులో నలుగురికి తీవ్ర గాయాలు

క్రోసూరు, పల్నాడుజిల్లా, ఆంధ్రప్రభ : పల్నాడుజిల్లా క్రోసూరు మండలం పీసపాడులో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. పీసపాడు గ్రామానికి చెందిన కంచేటి త్రివేణి(Kancheti Triveni) ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ బండ ఖాళీ కావటతో మరో గ్యాస్ సిలిండర్‌ను బిగిస్తుండగా పేలుడు సంభవించింది.

దీంతో ఇంట్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సాంబశివరావు(Sambasiva Rao), త్రివేణి, యతేంద్ర, సమీప గృహానికి చెందిన చిన్ని కోటేశ్వరరావు(Chinni Koteswara Rao) తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దానికి కంగారు పడిన స్థానికులు మంటలను ఆర్పే యత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక(Mapaka) సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో క్షతగాత్రులను సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply