MDK | జోగినాథ్ సేవలు చిరస్మరణీయం : మంత్రి దామోదర

జోగిపేట, జులై31(ఆంధ్రప్రభ): మాజీ సర్పంచ్ (Former Sarpanch) డాకూరి జోగినాథ్ (Dakuri Joginath) గ్రామ సర్పంచిగా చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) అన్నారు. జోగిపేట గ్రామ మాజీ సర్పంచ్ డాకూరి జోగినాథ్ వర్ధంతి వేడుకలను గురువారం జోగిపేట మున్సిపల్ పట్టణం (Jogipet Municipal Town) లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ వర్ధంతి కార్య‌క్ర‌మానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

జోగినాథ్ చిత్రపటానికి మంత్రి దామోదర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి పాటుపడిన నాయకుడు జోగినాథ్ అని కొనియాడారు. ఆయన చేసిన సేవలు మరవలేనివ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఎస్.జగన్ మోహన్, రాజా నర్సింహ ఫౌండేషన్ చైర్మన్ త్రిష దామోదర, మున్సిపాల్ మాజీ చైర్మన్ గూడెం మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్ జోగినాథ్ కుటుంబ సభ్యులు మాజీ ఎంపీటీసీ డాకూరి వెంకటేశం, మాజీ కౌన్సిలర్ డాకూరి శివశంకర్, మాజీ కౌన్సిలర్లు ఎస్. సురేందర్ గౌడ్, పిట్ల లక్ష్మణ్, హరికృష్ణ గౌడ్, నాగరాజు నాని, పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల ప్రవీణ్ కుమార్, నాయకులు మధు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply