Former Sarpanch | పెళ్లికానుక..

Former Sarpanch | పెళ్లికానుక..
- రూ.1,05,116 అందజేసిన మాజీ సర్పంచ్ అనిల్ సుందరి
Former Sarpanch | వికారాబాద్, ఆంధ్రప్రభ : ఇచ్చిన మాట ప్రకారం కరీంపూర్ గ్రామానికి చెందిన లాల్ బీ వాహేద్ కూతురు పెళ్ళి కానుకగా రూ. 1,05,116 వేలను బీఆర్ఎస్ పార్టీ కోట్పల్లి మండలం అధ్యక్షుడు, కరీంపూర్ మాజీ సర్పంచ్ సుందరి అనిల్ ఆదివారం అందజేశారు. ఈ వివాహ కార్యక్రమంలో కరీంపూర్ సర్పంచ్ షబానబి సదత్ పటేల్, ఉప సర్పంచ్ యేసు (మైసయ్య), గ్రామ పెద్దలు బిచ్చయ్య, అబ్బు సిద్ధిక్, పైజోదిన్, రషీద్, మొహమ్మద్ ఖాజాపాషా, సుందరి బంధయ్య, కరీం, యూ యేసు, యూ కుమార్, నర్సింలు, మొగులయ్య, చోటు యాత్ ప్రెసిడెంట్ మైబు పటేల్, గ్రామస్థులు పాల్గొన్నారు.
