ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలి

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బెజ్జంకిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫ్యాక్టరీ వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ కార్యకలాపాల కారణంగా కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారుతోందని ఆయన అన్నారు. ఫ్యాక్టరీ నుండి విలువడుతున్న చెడు వాసన తో ప్రజలు శ్వాసించడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు. అధికార పార్టీ అండదండలతో ఫ్యాక్టరీ కొనసాగుతుందని ఆరోపించారు.
