రైతులకు అండగా ప్రభుత్వం…..

రైతులకు అండ ప్రభుత్వం…..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ లింగాల కిష్టా గౌడ్ (Lingala Kishta Goud0 అన్నారు. శుక్రవారం బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.

అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. సీరియల్ ప్రకారం వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో బస్వాపూర్ సొసైటీ మాజీ డైరెక్టర్ కిష్టా రెడ్డి, సొసైటీ సీఈఓ మహేశ్వరి, సిబ్బంది రేణుక, భగవంత రెడ్డి రైతులు ఉన్నారు.

Leave a Reply