హైదరాబాద్, ఆంధ్రప్రభ : నారాయణఖేడ్ (Narayankhed) పట్టణంలోని సాంఘీక సంక్షేమ శాఖ బీసీ బాలికల వసతి గృహం (BC Girls Hostel) లో విద్యార్థినులపై మేట్రిన్ శారద కుమారుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ (Former Congress Party Councilor) రాజేష్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ విషయాన్ని బాలికలు మేట్రిన్ (Matrine), హాస్టల్ సిబ్బంది (Hostel staff) దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో నారాయణఖేడ్ పోలీసులకు బాలికలు ఫిర్యాదు చేశారు.
అటు అధికార పార్టీ.. ఇటు తల్లి అండ
అటు అధికార పార్టీ యువనేత.. ఇటు తల్లి మేట్రిన్ అండ చూసుకుని హాస్టల్‌కు రాజేష్ ప్రతి రోజూ తాగి వచ్చి బాలికలపై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజేష్ ప్రవర్తన పట్ల ఆయన తల్లి శారదకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. అలాగే సిబ్బంది దృష్టికి తీసుకు వెళ్తే అన్నలాంటి వాడే ఏం పర్వలేదు అంటూ బాలికలను తిడుతున్నారు. దీంతో ఆ బాలికలు పోలీసులను ఆశ్రయించారు.

