- భ్రమరాంబ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు
నంద్యాల బ్యూరో, జులై 15 (ఆంధ్రప్రభ) : నంద్యాల (Nandyala) జిల్లాలో ఉన్న జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం (Srisailam) లోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనంకై మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (Former Chief Election Commissioner) రాజీవ్ కుమార్ మంగళవారం శ్రీశైలంకు వచ్చారు. శ్రీశైలం కు వచ్చిన మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు నంద్యాల జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావులు వేద పండితులు స్వాగతం పలికారు.
దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజీవ్ కుమార్ (Rajiv Kumar) కు కార్యనిర్వాహణాధికారి దేవస్థానంకు సంబంధించిన అన్ని అంశాలను కూలంకషంగా వివరించారు. శ్రీశైల మల్లికార్జున స్వామి చరిత్రను తెలిపారు. దేవస్థానం యొక్క గొప్పతనాన్ని వివరించారు. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి ఉగాది బ్రహ్మోత్సవాల గురించి కూడా వివరించారు. అనంతరం భక్తుల ఎలాంటి సదుపాయాలు కలిగిస్తున్నాము లడ్డు యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. దేవస్థానం కి సంబంధించి చిత్రపటాన్ని సమర్పించారు. లడ్డు తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
