Kurnool | రైతన్నా మీ కోసం…

Kurnool | రైతన్నా మీ కోసం…


కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు మండలంలోని గార్గేపురం గ్రామంలో జిల్లా స్థాయి రైతు అభ్యసన సేవా కార్యక్రమం “రైతన్నా మీకోసం” ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అభివృద్ధి శాఖ సంయుక్త కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొని గ్రామ రైతులతో సవివరంగా మాట్లాడారు.

కార్యక్రమానికి హాజరైన అధికారులు:

  1. కర్నూలు వ్యవసాయ శాఖ అధికారి సాలు రెడ్డి. కర్నూలు ఎమ్మార్వో రమేష్ , వ్యవసాయ శాఖ అధికారి రుఫస్ రోనాల్డ్, గార్గేపురం సర్పంచ్ యేసేపు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ ఫీల్డ్ సిబ్బంది, ఆర్.బి.కె సిబ్బంది, గార్గేపురం గ్రామ రైతు సంఘం సభ్యులు పాల్గొన్నారు.
    ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. “రైతునే రాజు చేసే పంచ సూత్రాలు” అమలు లక్ష్యం వివరించారు. ప్రభుత్వం రూపొందించిన “రైతున్ను రాజు చేసే పంచ సూత్రాలు” గ్రామ స్థాయిలో పటిష్టంగా అమలు కావాలని సూచించారు.

అవి ఏంటంటే…

  1. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతు సంక్షేమం..
  2. రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించడం..
  3. పంటలకు న్యాయమైన, లాభదాయక ధరలు కల్పించడం..
  4. వ్యవసాయ సేవలను గ్రామ స్థాయికి సమర్థంగా అందించడం..
  5. వ్యవసాయ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం..

ఫీల్డ్ అధికారులకు కీలక సూచనలు..


“రైతన్నా మీ కోసం” కార్యక్రమం ప్రతి రైతు వరకూ చేరాలని ఫీల్డ్ స్థాయి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి సంయుక్త కలెక్టర్ ఆదేశించారు. రైతులు ప్రస్తావించిన పంట నిర్వహణ, ఇన్‌పుట్ లభ్యత, సాగు నీరు, మార్కెటింగ్ వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమం మొత్తం వ్యవసాయ రంగాన్ని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా సాగిందని అధికారులు తెలిపారు.

Leave a Reply