యువత, మహిళల కోసం..

యువత, మహిళల కోసం..
జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్ ఎస్టిపిపిలో నిర్వహిస్తున్న కంప్యూటర్ ఉచిత శిక్షణ తరగతులు ముగిసినట్లు సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు ఆశా కిరణ్ తెలిపారు. ఎస్టిపిపి ప్రభావిత గ్రామ మహిళలకు స్వయం ఉపాధికి గాను ప్రతి ఏటా సింగరేణి సేవా సమితి ద్వారా పలు వృత్తి విద్యా కోర్సులను ఉచితంగా అందజేసి, సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం సింగరేణి సేవా సమితి,ఎస్టిపిపి ఆధ్వర్యంలో 40 మంది మహిళలకు మదర్ హ్యూమన్ యూత్ సొసైటి ద్వారా శిక్షణ పొందిన తర్వాత సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా సిహెచ్ శివకుమారి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ సేవా సమితి ద్వారా ప్లాంటు ప్రభావిత గ్రామాల యువత, మహిళల కొరకు ప్రతి ఏటా ఉపాది శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతున్నదని, ఇప్పటి వరకు టైలరింగ్, బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్ లాంటి పలు రకాల శిక్షణా తరగతులను అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈడి సిహెచ్.చిరంజీవి, జీఎం నరసింహరావు, ఏఐటియుసి పిట్ సెక్రెటరీ సత్యనారాయణ, సీఎంఓఏఐ అధ్యక్షులు పంతులా, డీజీఎం (పర్సనల్) డి కిరణ్ బాబు, డాక్టర్ జానకి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్, అరుణ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

