donation| విద్య కోసం.. విరాళం..

50 సెంట్లు స్థలమును విరాళం

donation| మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా ఉప్పలూరు గ్రామంలో అన్నే పద్మనాభరావు అనే రైతు తన తల్లిదండ్రులు రామలింగయ్య – రాజ్యలక్ష్మి పేరు పై జిల్లా పరిషత్ హై స్కూలు నిర్మాణానికి అవసరమైన 50 సెంట్లు స్థలమును విరాళంగా ప్రకటించారు.

స్థలము విలువ అక్షరాల రెండు కోట్లు రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. వితరణ చేసిన స్థలంకు సంబంధించిన పత్రాలను కలెక్టర్ డీకే బాలాజీకి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్నే పద్మనాభరావును అభినందించారు.

ఉప్పలూరు గ్రామంలో విద్యార్థులు హైస్కూల్ విద్యను అభ్యసించాలంటే.. దాదాపు నాలుగు, ఆరు కిలోమీటర్లు వెళ్లవలసి ఉండేది. ఉప్పలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల విద్యార్థుల ప్రయోజనార్థం 50 సెంట్లు స్థలమును పద్మనాభరావు తల్లిదండ్రులు పేరు పై జిల్లా పరిషత్ మెమోరియల్ స్కూల్ ను ప్రభుత్వం నిర్మించనుంది.

ఈ కార్యక్రమంలో అన్నే దానరామ కోటేశ్వరరావు, రామ సురేష్ ఉప్పలూరు గ్రామ సర్పంచ్ చలసాని రాధాకృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు, మద్దాల రామచంద్రరావు, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉషకుమారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply