ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తుంటారు. ఎంతో మంది పేదలు ఆహారం కోసం అలమటిస్తుంటారు. కానీ కొందరు ఆహారాన్ని యథేచ్ఛగా వేస్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఫంక్షన్స్, హోటళ్ల (Functions, in hotels)లో ఫుడ్ బాగా వేస్ట్ అవుతుంటుంది. కొందరు పరిమితికి మించి హోటళ్లలో ఫుడ్ ఆర్డర్ (food order) చేస్తుంటారు. కొంత వరకు తిని ఆ తర్వాత చాలావరకు తినకుండా వదలేస్తారు. ఆ మిగిలినదంతా డస్ట్ బిన్(dust bin)లోకి వెళ్లాల్సిందే. ఇలా జరగకూడదనే మహారాష్ర్ట పుణె(Maharashtra Pune)లోని ఓ హోటల్ మేనేజ్మెంట్ (Hotel Management) వినూత్నంగా ఆలోచించింది. ఇక్కడ ఫుడ్ వేస్ట్ చేస్తే రూ.20 ఫైన్ (Rs.20 Fine) చెల్లించాలని ఆ హోటల్లో బోర్డు పెట్టారు. ఈ బోర్డును ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేసి .. ప్రతి హోటల్లో, శుభకార్యాలలో ఇలాంటివి బోర్డులు పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. హోటల్ వారు ఇలా బోర్డు పెట్టడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఆహార వృథాని అరికట్టవచ్చు అని అంటున్నారు.
ఓ హోటల్ యాజమాన్యం వినూత్న ఆలోచన
