శ్రీ సత్యసాయి జిల్లాలో ఘటన
శ్రీ సత్యసాయి : జిల్లాలోని సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ (Food poisoning) జరిగింది. ఫుడ్ పాయిజన్‌తో 33మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో జిల్లా విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కేజీబీవీ హాస్టల్ (KGBV Hostel) కు అధికారులు చేరుకొని హాస్టల్‌లో తనిఖీలు చేశారు.
రాత్రి సాంబార్ అన్నం తిన్నామని.. ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైనట్లు విద్యార్థినులు చెప్పారు. వారు తిన్న సాంబార్ అన్నం శాంపిల్స్‌ని అధికారులు సేకరించి పరీక్షకు పంపించారు. వాంతులు, విరేచనాలతో మరికొంత మంది విద్యార్థినులు అస్వస్థత (Students sick) కు గురయ్యారు. ఈ విషయం విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. అసలు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు.